రోజాకు బండ్ల గణేష్ ధన్యవాదాలు…!

-

ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన చర్చలో భాగంగా ప్రముఖ హాస్య నటుడు బండ్ల గణేష్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అక్కడ వాళ్ళు తిట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు. ఏమీ లేదండి… కరోనా దెబ్బకు ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ తరుణంలో లాక్ డౌన్ లో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఏంటీ ఆమె చికెన్ లెగ్ పీస్ లను వేయించుతూ ఉన్న వీడియో పోస్ట్ చేసారు.

కరోనా సందర్భంగా రోజా తన ఇంట్లోనే ఉండి తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చికెన్ వండుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన నటుడు బండ్ల గణేష్ ఆమెను కొనియాడుతూ… ఇక రోజా తన ఇంట్లో చేసిన చికెన్ వీడియోను పెట్టి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ కి కోళ్ళ ఫారాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా నష్టపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news