సరికొత్త రికార్డ్.. 2138 మంది ఒకేసారి వినాయకుడి మట్టి విగ్రహాల తయారీ..!

-

కాలుష్యాన్ని తగ్గించాలని, మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని చెబుతూ బెంగళూరు వాసులు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఒకే వేదికపై పెద్ద ఎత్తున వినాయకుడి మట్టి విగ్రహాలను వారు తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు.

గణేష్ విగ్రహాల తయారీలో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, థర్మోకోల్ పదార్థాల వల్ల పర్యావరణానికి ఎంతగానో నష్టం కలుగుతుందన్న విషయం విదితమే. అందుకనే అలాంటి పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఏటా చెరువులు, నదులు, సరస్సుల్లో నీటి కాలుష్యం మరింత పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ కాలుష్యాన్ని తగ్గించాలని, మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని చెబుతూ బెంగళూరు వాసులు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఒకే వేదికపై పెద్ద ఎత్తున వినాయకుడి మట్టి విగ్రహాలను వారు తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. వివరాల్లోకి వెళితే…

bangalore Guinness record for making 2138 ganesh idols at same time

బెంగళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో శ్రీ విద్యారణ్య యువక సంఘ, బెంగళూరు గణేష్ ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 25, 2019) ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకే వేదికపై 2138 మంది ఒకేసారి వినాయకుడి మట్టి విగ్రహాలను తయారు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అంతకు ముందు ఈ రికార్డు 589 పేరిట ఉండగా.. ఇప్పుడు ఏకంగా అంత మంది ఒకేసారి వినాయకుడి మట్టి విగ్రహాలను తయారు చేయడం విశేషం.

కాగా ఆ మట్టి విగ్రహాల తయారీకి పూర్తిగా సహజ సిద్ధమైన పదార్థాలనే ఉపయోగించడం మరో విశేషం. అందుకు గాను వారు మట్టి, తులసి విత్తనాలు తదితర పదార్థాలను వాడారు. ఈ కార్యక్రమంలో అనేక మంది చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వినాయకుడి విగ్రహాలను వాడడం వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. అవును మరి.. అందరూ మట్టి వినాయకుడి విగ్రహాలను వాడితేనే పర్యావరణం సురక్షితంగా ఉంటుంది. లేకపోతే మన చేతుల్తో మనమే దాన్ని నాశనం చేసిన వారమవుతాం. కనుక పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటే.. అందరూ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలనే ఉపయోగించడం మరిచిపోకండి..!

Read more RELATED
Recommended to you

Latest news