Bangarraju : బంగార్రాజు రివ్యూ

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా… బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచ కట్టులో సరసాలు చిలిపి వేషాలకు బాక్సాఫీస్ మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది.  అయితే ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. దీంతో సినిమా పై మంచి టాక్ వస్తోంది.

కథ వివరాల్లోకి వెళితే.. సోగ్గాడే కథ… ముగిసిన దగ్గర్నుంచి బంగార్రాజు ను ప్రారంభించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఫస్టాఫ్ కలర్ఫుల్ విలేజ్ సెట్ అప్ లో జరుగుతుంది. నాగచైతన్య మాస్ లుక్ తో కనిపిస్తూ విలేజ్ అమ్మాయిల తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక కృతి శెట్టి ట్రైలర్ లో చూపిన విధంగా విలేజ్ సర్పంచ్ పాత్రలో ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు విలేజ్ రొమాంటిక్ సీన్స్ అలాగే కామెడీ సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దాడు. నాగార్జున తిరిగి భూమి పైకి వచ్చాక కథలో మలుపులు మొదలవుతాయి.

నాగార్జునను, నాగ చైతన్య న్యూ సింగిల్ ఫ్రేమ్ లో చూడటం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. కథను లైట్ గా టచ్ చేస్తూ ఫన్నీ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించే విధంగా సాగుతుందని ట్విట్టర్ జనాలు అంటున్నారు. ఫస్టాఫ్ లో నాగచైతన్య తన పెర్ఫార్మెన్స్ తో వ్యాపించగా సెకండాఫ్ లో మాత్రం నాగార్జున కంప్లీట్ మాస్ గా కనిపిస్తాడని ఆ సన్నివేశాలను ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇంకా క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా బంగార్రాజు చిత్రంపై ట్విట్టర్ లో నెగటివ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కథాకథనాలు బలంగా లేవని అంటున్నారు. నాగచైతన్య.. నాగార్జున ను దర్శకుడు ప్రజెంట్ చేసే విధానం బాగుంది కానీ బలమైన సన్నివేశాలతో కథను నడిపించలేక పోయారు అని చెబుతున్నారు. కంటెంట్ అవేరేజ్ గా ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ కి కావాల్సిన అంశాలు అన్నీ బంగార్రాజు లో ఉన్నాయని.. ఖచ్చితంగా ఈ సినిమా బంపర్ విజయాన్ని సాధిస్తుందని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news