ఒమిక్రాన్ ఎఫెక్ట్: సౌతాఫ్రికాలో ఐపీఎల్ – 2022?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్. ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు కండ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. రెండు నెలలపాటు బౌండరీల వర్షంలో తడిసి ముద్దవుతుంటారు. గత రెండు సీజన్లుగా క్యాష్ రిచ్ లీగ్‌ను కొవిడ్-19 మహమ్మారి పట్టిపీడిస్తున్నది. ఈసారైనా సజావుగా సాగుతుందనుకుంటున్న ఐపీఎల్‌ను ఒమిక్రాన్ భయాందోళనలు వెంటాడుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 2.50 లక్షలకు చేరుకున్నది. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టకపోతే ఐపీఎల్ వేదికను భారత్ నుంచి మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టిన సౌతాఫ్రికాలో లీగ్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సౌతాఫ్రికాలో వీలుకాకపోతే శ్రీలంకను ఎందుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news