బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బల్ నిన్న అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. మరో మూడు నెలల్లో ఇండియా లో వన్ డే వరల్డ్ కప్ జరగనుండడంతో ఇప్పుడే తమీమ్ ఇక్బల్ రిటైర్మెంట్ ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు మరియు దేశానికి కూడా ఇష్టం లేదన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. అందుకే తమీమ్ అక్బల్ ను రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజముల్ హాసన్ పాపోన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తమీమ్ ఇక్బల్ ను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానం పంపారట. దేశం కోసం ఈ వరల్డ్ కప్ వరకు తన రిటైర్మెంట్ విషయాన్ని వెనక్కు తీసుకోవాలని అడగడానికి పిలిచి ఉంటారన్నది అందరి ఆలోచన.
మరి దేనికన్నది తెలియాలంటే తమీమ్ ఇక్బల్ ప్రధానిని కలిసే వరకు ఆగాల్సిందే.