తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చెరో 6 వేల కోట్ల సాయం…?

-

అకాల వర్షాలు వరదల దెబ్బకు రెండు తెలుగురాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి చూసాం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ సహాయం అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కావాల్సి ఉంది. ఈ నేపధ్యంలో కేంద్రం రెండు రాష్ట్రాలకు భారీగా వరద సహాయం చేయడానికి రెడీ అవుతుంది. హైదరాబాద్ కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి వరద నష్టాన్ని అంచనా వేసింది.

ఎపీకి కూడా నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నాలుగో వారంలో రెండు రాష్ట్రాలకు చెరో 6 వేల కోట్ల మేర వరద సహాయం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేంద్రం ఆర్ధిక సహాయం చేయనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ తెలంగాణకు సంబంధించి పరిశీలిస్తుంది అని, ఏపీ నష్టం కూడా అంచనా వేసి ఆ తర్వాత నిధులు రెండు రాష్ట్రాలకు ఒకేసారి విడుదల చేస్తుంది అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news