హిజాబ్ వివాదంపై వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్, బర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు చిహ్నాలు అని తస్లిమా పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాజుకు ఉన్న హిజాబ్ వివాదం దేశంలో ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన నేపథ్యంలో తస్లిమా నస్రిన్ మాట్లాడారు. విద్యాహక్కు మతానికి సంబంధించిన హక్కు అని నేను నమ్ముతున్నాను. హిజాబ్‌ను 7వ శతాబ్దంలో కొంత మంది స్త్రీ ద్వేషులు పరిచయం చేశారు. ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలను ఓ వస్తువులుగా పరిగణించేవారు. పురుషులు స్త్రీలను చూస్తే.. పురుషులు అదొక కోరిక కలుగుతుందని నమ్మతారు.
కాబట్టి మహిళలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుంచి తమను తాము దాచుకోవాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో స్త్రీలు పురుషులతో సమానం అని.. హిజాబ్ లేదా నిఖాబ్ లేదా బురఖా అణచివేతకు చిహ్నాలను తస్లిమా చెప్పారు. మతం కంటే విద్యే ముఖ్యమని లౌకిక సమాజంలో సెక్యులర్ డ్రెస్‌కోడ్ ఉండాలని ఆమె ఉద్ఝాటించారు. ఓ వ్యక్తి గుర్తింపు మత పరమైన గుర్తింపుగా ఉండకూడదు అని తస్లిమా నస్రిన్ వివరించారు.