WI vs IND : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మూడో టి20కి ఫ్యాన్స్ కు అనుమతి

-

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభ వార్త చెప్పింది. కోల్కతా ఈడెన్ గార్డెన్ వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ జరగనున్న మూడో టి20 మ్యాచ్ ప్రేక్షకులతో కళకళలాడనుంది. 20 వేల మంది ఫ్యాన్స్ ను అనుమతించాలని బిసిసిఐ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

వీరిలో ఎక్కువమంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టికెట్ హోల్డర్ సభ్యులు ఉండనున్నారు. ఫ్యాన్స్ కు అనుమతించినందుకు బిసిసిఐకి సిఎబి చీఫ్ అభిషేక్ దాల్మియా కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీ-20 సిరిస్‌లో భాగంగా నిన్న  వెస్టిండిస్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు వ‌న్డే త‌రువాత టీ-20 సిరీస్ లో శుభారంభం చేసింది. దీంతో మూడు టీ-20ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

భార‌త కెప్టెన్ రోహిత్ కేవ‌లం 19 బంతుల్లోనే 40 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు.స్లోగా బ్యాటింగ్ ఆరంభించిన ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ (35) రోస్ట‌న్ చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి బౌండ‌రీ వ‌ద్ద ఫాబియ‌న్ అలెన్‌కు చిక్కాడు. దీంతో ఇండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news