వామ్మో.. మార్చిలో బ్యాంకుల‌కు ఏకంగా 19 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

-

మార్చి నెలలో బ్యాంకులకు దేశ‌వ్యాప్తంగా ఏకంగా 19 రోజులు సెలవులు రానున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 రోజులు పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులు అందుకు అనుగుణంగా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు. మూడు రోజుల బ్యాంక్ బంద్‌తో పాటుగా సాధారణ సెలవులు, పండగ సెలవులు వెరసి 16 రోజులు కలిపి మొత్తం 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు వెళ్లేవారికి మార్చిలో కష్టాలు తప్పవు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకోండి.

మార్చి 1- ఆదివారం, మార్చి 5- పంచాయతీ రాజ్ దినోత్సవం(ఒడిశా), మార్చి 6- చాప్చర్‌కుట్ పండగ(మిజోరాం), మార్చి 8- ఆదివారం, మార్చి 9- హజరత్ అలీ పండగ(ఉత్తరప్రదేశ్), మార్చి 10- డోల్ పూర్ణిమ(ఒడిశా, వెస్ట్ బెంగాల్, త్రిపురా), హోళీ, మార్చి 11 నుంచి 13- బ్యాంకుల సమ్మె, మార్చి 14- రెండో శనివారం, మార్చి 15- ఆదివారం, మార్చి 22- సండే, మార్చి 23- షాహిద్ భగత్ సింగ్ డే(హర్యానా), మార్చి 25- ఉగాది(కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, జమ్మూ కశ్మీర్), మార్చి 26- చేటిచంద్ యానివర్సరీ( గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్), మార్చి 27- సర్హుల్ పండగ( ఝార్ఖండ్), మార్చి 28- నాలుగో శనివారం, మార్చి 29- ఆదివారం.. ఇలా దేశ‌వ్యాప్తంగా మార్చి నెల‌లో బ్యాంకుల‌కు 19 రోజులు సెల‌వులు వ‌చ్చాయి

Read more RELATED
Recommended to you

Latest news