కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

-

ఈరోజుల్లో క్రెడిట్‌ కార్డుల వాడకం భారీగా పెరిగింది. జాబ్‌ చేసేవాళ్లకు పిలిచి మరీ బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నాయి. క్రెడిట్‌ కార్డును ఓ మహానుభావుడు సెకండ్‌ వైఫ్‌తో పోల్చాడు.. ఎలా అంటే.. రెండో భార్యను కూడా చాలా జాగ్రత్తగా మెయింటేన్‌ చేయాలి.. లేదంటే.. కంపు కంపు అవుతుంది. క్రెడిట్‌ కార్డును కూడా అంతే..జాగ్రత్తగా వాడకపోతే.. బిల్లులు కట్టడానికే జీతం అంతా అయిపోతుంది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని సంస్థలు.. బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. వీటిని తీసుకోవడం ఎంత వరకూ మంచిది..? వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా..? నిపుణులు ఏం అంటున్నారో చూద్దామా..?

అసలు కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డు అంటే..

సాధారణ క్రెడిట్‌ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు అందించేవే ఈ కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డులు. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు. ఇలా మొదలైన వాటితో కలసి (టై-అప్‌తో) వీటిని తీసుకొని వస్తాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్‌లతో చేసిన లావాదేవీల కోసం ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ రుసుములపై రాయితీ అందిస్తాయి. మీ అలవాట్లకు సరిపోయే కార్డును ఉపయోగిస్తే సాధారణ క్రెడిట్‌ కార్డు కంటే అదనంగా రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందుతారు.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు ఇచ్చిన మైలురాయిని చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు. పైగా మైలు స్టోన్‌ రివార్డు పాయింట్ల కింద అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు సూచించిన మర్చంట్స్‌ నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని అవి అందిస్తాయి. కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డులను కొత్తగా తీసుకున్న వారికి వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద షాపింగ్‌ కూపన్లు, డిస్కౌంట్లు అవి అందిస్తాయి.

ఎలాంటి కార్డు ఎంచుకోవాలి?

ఏదైనా క్రెడిట్‌ కార్డును ఎంచుకునే ముందు మీరు దేనిపై డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో దానికి తగిన కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డును ఎంచుకోండి. ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు వంటి ప్రయోజనాలతో సరిపోల్చండి. మల్టిపుల్ బ్రాండ్ల అనుసంధానంతో ఉన్న క్రెడిట్‌ కార్డులను ఎంచుకోవటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news