ఈ కస్టమర్స్ కి గుడ్ న్యూస్.. ఆ సేవలు ఇంటి నుండే పొందొచ్చు..!

మీకు కరూర్ వైశ్యా బ్యాంక్ లో అకౌంట్ వుందా…? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ కస్టమర్స్ కి అదిరే వార్త చెప్పింది. అయితే ఇది కస్టమర్స్ కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

బ్యాంక్ కస్టమర్లు ఇంటి వద్ద నుంచే కస్టమ్ డ్యూటీ చెల్లించొచ్చని బ్యాంక్ చెప్పింది. ఐసీఈజీఏటీఈ ప్లాట్‌పామ్ ద్వారా నేరుగా చెల్లింపులు నిర్వహించచ్చు అని బ్యాంక్ తెలిపింది. అయితే ఇది కస్టమర్స్ కి రిలీఫ్ గా ఉంటుంది. ఇటీవలనే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు‌ను తగ్గించింది. దీంతో ఈ రేటు 12.75 శాతానికి తగ్గింది.

0.25 శాతం కోత విధించింది. బేస్ రేటు అయితే 0.25 శాతం క్షీణతతో 7.75 శాతానికి తగ్గింది. ఈ రేటు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. ఇది ఇలా ఉంటే గత వారంలో ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కస్టమర్లకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు ఫెసిలిటీని కూడా అందించింది.

పన్ను వసూళ్లకు సంబంధించి బ్యాంక్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు కస్టమ్ డ్యూటీని నేరుగా చెల్లించొచ్చు. ఇక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి రమేశ్ బాబు ఏమన్నారంటే..?ఐసీఈజీఏటీఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లు కేవీబీ ఆప్షన్ ని ఎంచుకుంటే నేరుగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించొచ్చని అన్నారు.