బంగారంపై తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంక్స్ ఇవే..

-

మిగతా లోన్స్ తో పోల్చితే గోల్డ్ లోన్స్ చాలా త్వరగా మంజూరవుతాయి. ఈ లోన్స్ మన అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. బంగారం విలువలో దాదాపు 75 శాతం దాకా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా చాలా తొందరగా పూర్తవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.75 వేలకు చేరింది. ధర పెరగడంతో బంగారం రుణాల పరిమాణం కూడా పెరిగింది. ఎక్కువ బంగారం కలిగి ఉన్న కస్టమర్లు తమ ఆభరణాలను మానిటైజ్ చేస్తారని తెలిసింది. ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ గోల్డ్ ని తాకట్టు పెట్టాలనుకునే వారికి గోల్డ్ లోన్లు అనేవి చాలా ఉపయోగంగా ఉంటాయి.గోల్డ్ లోన్స్ పై వడ్డీరేటు అనేది ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం కాల వ్యవధిపై రూ.5 లక్షల రుణాన్ని 8.8 శాతం నుంచి 9.15 శాతం మధ్య వడ్డీతో కొన్ని మంజూరు చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై మొత్తం 9.6 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. దీనికి ప్రతి నెలా రూ.43,615 ఈఎమ్ఐ చెల్లించాలి.ఇక యాక్సిస్ బ్యాంక్ ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై ఏకంగా 17 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. దీని ఈఎమ్ఐ రూ.44,965 గా ఉంటుంది.బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై మొత్తం 9.15 శాతం వడ్డీని వసూలు చేస్తారు.ఇందులో ప్రతినెలా కూడా రూ.43,430 ఈఎంఐ చెల్లించాలి.అలాగే యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లలో ఏడాది కాల పరిమితితో మొత్తం రూ.5 లక్షల రుణానికి 9.25 శాతం వడ్డీని విధిస్తారు. ఇందులో లోన్ తీసుకున్నవారు ప్రతినెలా ఈఎమ్ ఐ గా రూ.43,450 కట్టాలి.

అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.8 శాతం వడ్డీని విధిస్తుంది. అన్ని బ్యాంకుల కన్నా అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. లోన్ కి సంబంధించిన ఈఎమ్ఐ (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా) రూ. 43,360గా ఉంటుంది. ఇక ఇండియన్ బ్యాంక్ కూడా ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.95 శాతం వడ్డీని విధిస్తుంది.ఇందులో నెలవారీ వాయిదా రూ. 43,390 చెల్లించాలి.కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ ఇంకా ఐసీఐసీఐ బ్యాంకులు కూడా బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. ఇక ఇవి కూడా సంవత్సరం కాలపరిమితితో రూ. 5 లక్షలకు 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ బ్యాంకులలో నెల వాయిదా వచ్చేసి మొత్తం రూ. 43,400గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news