దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ ని చెబుతోంది. తాజా ఐసిఐసిఐ బ్యాంక్ రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకటనని ఒకటి చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా పేరుతో బంపరాఫర్లు ప్రకటించడం జరిగింది. దీని వలన కస్టమర్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫెస్టివ్ బొనాంజా లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ రుణ గ్రహీతలకు పలు ఆఫర్లు అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్స్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులో వున్నాయి.
హోమ్ లోన్ తీసుకునే వారికి 6.7 శాతం వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1100 నుంచి ప్రారంభమౌతోంది. ఇది ఇలా ఉంటే వెహికల్ లోన్ తీసుకునే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. టూవీలర్ లోన్ కి అయితే రూ.1000కు రూ.29 నుంచి ఈఎంఐ ప్రారంభమౌతుంది. 48 నెలలోగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. రూ1499 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
వెహికిల్ లోన్ తీసుకుంటే ఆకర్షణీయ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఈఎంఐ రూ.లక్షకు రూ.799 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా తీసుకున్న రుణాన్ని 8 ఏళ్లలో తిరిగి చెల్లించొచ్చు. అలానే కారు లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 10.5 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. పర్సనల్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేటు 10.25 శాతం నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1999.