Aaradugula Bullet : ఎట్ట‌కేల‌కు ఆరడుగుల బుల్లెట్ కు రిలీజ్‌కు మోక్షం.. మ‌రీ మెగాల్లుడితో బ‌రిలో నిలిచేనా!

-

Aaradugula Bullet: టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపిచంద్.. కానీ, ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌నకు సరైన హిట్ త‌గ‌ల‌లేదు. ప్రతిసారి.. అతని సినిమాలు భారీ అంచనాల‌తో విడుదలైన చివరికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోర్లా ప‌డేవి. కానీ. ఇటీవ‌ల‌ స్పోర్ట్స్ బాక్ డ్రాప్ తో తెర‌కెక్కిన సినిమా సీటీమార్.. ఈ సినిమాతో గోపిచంద్ సూపర్ బుప‌ర్ హిట్ అందుకున్నారు. సీటీమార్ సక్సెస్ సాధించ‌డంతో .. ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాను స‌న్నాహకాలు చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ వంటి సూప‌ర్ హిట్ల‌ను అందించిన దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం థియేటర్స్‌లో విడుదల కావాల్సి ఉండే కానీ.. ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల కాలేదు. మధ్యలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

సీటీమార్ హీట్ కొట్టడంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా .. రిలీజ్ చేయాల‌ని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. 2012లో సెట్స్ మీద‌కి వ‌చ్చిన ఈ సినిమా ఫైన‌ల్ గా 9 ఏళ్ళ తరువాత అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

అయితే.. ఈ రోజే.. మెగా అల్లుడు వైష్ణ‌వ్ తేజ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న కొండపొలం విడుద‌ల కానున్న‌ది. ఓ వర్గం ప్రేక్షకులలో కొండపొలం మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆరడుగుల బుల్లెట్ పై అయితే పెద్దగా అంచనాలు ఏమి లేవు. ప్రమోషన్స్ కూడా ఎవరు చేయడం లేదు. మరి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news