క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలిస్తే.. మనకంటే తెలివైన వాళ్ల ఎవరూ ఉండరు తెలుసా..? అలాగే అది వాడే విధానం తెలియకపోతే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. బిల్ అమౌంట్‌కు సరిపడా పైసల్ లేవని..మినిమన్ బిల్ కట్టడం, అసలు మొత్తానికి కట్టకుండా ఉండటం ఇలాంటివి చేస్తే ఘోరంగా నష్టపోతాం. అలాగే క్రెడిట్ కార్డుల్లో బోలెడు ఆఫర్స్ ఉంటాయి. ఈ మధ్యనే హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇది కోబ్రాండెడ్ హోటల్ క్రెడిట్ కార్డు. దేశంలో ఇలాంటి క్రెడిట్ కార్డు మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. ఇంతకీ అది ఏ క్రెడిట్ కార్డులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి. ఆ అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మారియట్ బోన్వాయ్ సంస్థతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మారియట్ బోన్వాయ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకువచ్చింది. ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన డిస్కవర్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగమైన డైనర్స్ క్లబ్ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తుంది. ఇందులో ట్రావెల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మారియట్ బోన్వాయ్‌లో ఈ కార్డు కలిగిన వారికి సిల్వర్ ఎలైట్ స్టేటస్ లభిస్తుంది. ప్రియారిటీ లేట్ చెక్ ఐట్స్, ఎక్స్‌క్లూజివ్ మెంబర్ రేట్లు, బోనస్ పాయింట్లు వంటి తదితర ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావించే వారికి పలు బెనిఫఇట్స్ ఉన్నాయి.
వెల్‌కమ్ గిఫ్ట్ లేదా కార్డు రెన్యూవల్ చేసుకుంటే ఫ్రీ నైట్ అవార్డ్ లభిస్తుంది. 15 వేల పాయింట్లు పొందొచ్చు.
మారియన్ హోమల్స్‌కు వెళ్లి మీరు ఈ పాయింట్లను రిడీమ్ చేసుకుకోవచ్చు.
క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 8 వారియట్ పాయింట్లు లభిస్తాయి. మారియట్ హోటల్స్‌కు ఇలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాన్సాక్షన్లపై అయితే రూ.150 ఖర్చుపై 4 మారియట్ పాయింట్లు పొందొచ్చు.
ఇతర ఖర్చులపై ప్రతి రూ.150కు 2 మారియట్ పాయింట్లు పొందొచ్చు. ఫ్యూయెల్, వాలెట్ రీలోడ్, రెంటల్స్ వంటి ట్రాన్సాక్షన్లను ఇందుకు మినహాయింపు. డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది.
అలాగే పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరె కవరేజ్ కూడా లభిస్తుంది. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.3 వేలుగా ఉంది. అలాగే ఇది ప్రీమియం కార్డు. అందువల్ల కొందరికే అందుబాటులోఉండొచ్చు.
నెలకు రూ.రూ.లక్షకు పైగా వేతనం పొందే వారికి మాత్రమే ఈ కార్డు లభిస్తుంది.
21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.