సెప్టెంబర్‌ నెలాఖరులో లాంగ్‌ హాలిడేస్‌.. ఒకేసారి ఐదు రోజుల సెలువులు.. అస్సలు మిస్‌ కాకండి.!!

-

లాంగ్‌ వీకెండ్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. సెప్టెంబర్‌ నెలాఖరులో ఒకేసారి ఐదు రోజులు సెలవు తీసుకోవచ్చు. మంచి ట్రిప్‌ ప్లాన్‌ చేసే ఆలోచనలో ఉంటే.. ఇదే మంచి సమయం. కాకపోతే.. ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ లాంగ్‌ వీకెండ్‌ను మిస్‌ అయిపోతారు. అసలు సెప్టెంబర్‌లో అన్ని రోజులు సెలువులు ఎక్కడ నుంచి వస్తున్నాయా అనుకుంటున్నారా..? శనిఆదివారం వీక్‌ ఆఫ్‌ ఉన్నవాళ్లు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలండోయ్.. ఇంతకీ హాలిడేస్‌ ఎప్పుడంటే..

సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 2 వరకూ.. ఐదు రోజులు హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చు.. ఎలా ప్లాన్‌ చేసుకోవాలో ఇక మీ ఇష్టం.. అయితే ఈ విషయం మిగతా మీ టీమ్‌ మెట్స్‌కు తెలియకముందే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే.. సెప్టెంబర్‌ 28 గురువారం ఈద్ ఇ మిలాద్.. ముస్లింల పండుగ. ఆరోజు పబ్లిక్‌ పబ్లిక్‌ హాలిడే.. ఇక సెప్టెంబర్‌ 29 శుక్రవారం మీరు క్యాజువల్‌ లీవ్‌ ఆర్‌ సిక్‌ లివ్‌ పెట్టారంటే.. సెప్టెంబర్‌ 30 శనివారం, అక్టోబర్‌ 1 ఆదివారం, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి. సో.. కొడితే ఒకేసారి ఐదు సెలవులు వచ్చేస్తాయి. అసలు ఎక్కడకు వెళ్లకున్నా. అన్ని రోజులు ఏ పని లేకుండా ఇంట్లో కుర్చున్నా.. ప్రశాంతంగా ఎంజాయ్‌ చేయొచ్చు. దగ్గర దగ్గర వారం పాటు.. వర్క్‌ టెన్షన్‌ లేకుండా, ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేయకుండా.. మందేస్తూ, చిందేస్తూ అంటూ చెలరేగిపోవచ్చు. హైదరాబాద్‌లో ఉండేవాళ్లు అయితే..చుట్టపక్కల ప్రాంతాల్లో టూర్‌ వేయొచ్చు. ఐదురోజులు సరిపోతాయి కూడా.

ఇంకేందుకు ఆలస్యం.. ట్రిప్‌ రెడీ చేసుకోండి.. ఫ్యామిలితో గడపడానికి ఊర్లకు వెళ్లేవాళ్లకు కూడా ఇదే మంచి అవకాశం. ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకోవాలంటే.. వెంటనే చేసుకోండి.. కచ్చితంగా అప్పటికీ ట్రైన్స్‌ ఖాళీగా ఉండవు. ఈ విషయం అందరికీ తెలియకముందే మీరు ప్లాన్‌ చేసేసుకోండి. ఆఫీస్‌ అంతా సెప్టెంబర్‌ 29 లీవ్‌ పెడితే కుదురదు.. బాస్‌ ఇవ్వడు కాబట్టి..ముందే మేల్కోని..మనం లీవ్‌ పెట్టేస్తే సెట్‌..!

Read more RELATED
Recommended to you

Latest news