క్రిప్టో క‌రెన్సీ పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్

-

క్రిప్టో క‌రెన్సీ పై రిజ‌ర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. శ‌క్తి కాంత దాస్ క్రిప్టో కరెన్సీ పై స్పందించడం ఈ వారం లో రెండో సారి స్పందించాడు. ఈ క‌రెన్సీ తో చాలా లోతైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేశాడు. ఈ క్రిప్టో క‌రెన్సీ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చాలా ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అంతే కాకుండా ఆర్థిక స్థిరత్వానికి కూడా చాలా ముప్పు ఉంద‌ని అన్నారు. ఆర్బీఐ స‌మావేశాల‌లో కూడా ప‌లువురు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారని గుర్తు చేశారు. క్రిప్టో క‌రెన్సీ ల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి ఆర్బీఐ నుంచి ఒక నివేదిక అంద‌జేసిన‌ట్టు తెలిపాడు.

క్రిప్టో క‌రెన్సీ మార్కెట్ లో పెట్టుప‌డుల సంఖ్య పెరుగుతుంది కానీ.. ప‌రిమాణం పెర‌గ‌డం లేద‌ని అన్నారు. చాలా మంది రూ. 500 రూ. 1000 క‌నీస పెట్టు ప‌డులు పెడుతున్న‌ట్టు తెలిపాడు. దాదాపు ఇలాంటి వే 70 శాతం నుంచి 80 శాతం వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలిపారు. అయితే గ‌తంలో వ‌ర్చువ‌ల్ కరెన్సీ ల‌కు సేవ‌ల‌ను అందించ‌కుండా బ్యాంకు ల తో పాటు ఇత‌ర సంస్థ ల పై ఆర్బీఐ నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని ఈ ఏడాది మార్చి 4 న సుప్రీం కోర్టు ఎత్తేసింది. అయితే మ‌రోసారి ఆయా కంపెనీల కు సేవ‌లు నిలిపివేయాల‌ని బ్యాంక్ ల‌కు ఇత‌ర సంస్థ‌ల కు ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news