కారు కొనే వారికి శుభవార్త.. ఎస్‌ఐబీ అదిరే ఆఫర్లు..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కొన్ని అద్భుతమైన ఆఫర్స్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక వాటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI
SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకి అదిరే ఆఫర్స్ ని తీసుకు రావడం జరిగింది. పండుగ సీజన్ వచ్చేసింది కనుక కారు కొనాలని అనుకునే వాళ్ళు ఈ ఆఫర్స్ ని వినియోగించుకోవచ్చు అని స్టేట్ బ్యాంక్ చెప్పింది. ఈ అదిరే ఆఫర్స్ తో కార్ కొని డబ్బులు ఆదా చేసుకోచ్చు. కొత్తగా కారు కొనే వారికి ఎస్‌బీఐ సులభంగానే రుణాలు అందిస్తోంది.

క్షణాల్లో సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చు. అంతే కాదండి వడ్డీ కూడా తగ్గుతుంది. 0.25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రియారిటీ డెలివరీ సదుపాయం ఉంది. అయితే ఎస్‌బీఐ యోనో ద్వారా కారు కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. కియా కార్ల కొనుగోలుకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కారు బుక్ చేసుకోవాలని భావించే వారు ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి వెళ్లి షాప్ అండ్ ఆర్డర్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఆటోమొబైల్ ఆప్షన్ ద్వారా కారుని బుక్ చేసి ఆఫర్ పొందొచ్చు.