తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నేడు తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీగా బహిరంగ సభలు జరుగనున్నాయి. కాంగ్రెస్ మరియు బి.జె.పి దారులు వేరైనా… అధికార టీఆర్ఎస్ పార్టీ నీ పడగొట్టడం మే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి రెండు పార్టీ.
ఇంకా ఇందులో భాగంగానే నేడు నిర్మల్ జిల్లాలో బిజెపి ఓ సభను నిర్వహిస్తుండగా… ఇటు సీఎం కేసీఆర్ ఇలాకా అయినా గజ్వేల్ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ దళిత మరియు గిరిజన సభను ఏర్పాటు చేయనుంది. ఒక పార్టీని మించి మరో పార్టీ సభ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు ఇరుపార్టీల నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దళితుల తోపాటు గిరిజనులకు కూడా అమలు చేయాలన్న డిమాండ్ తో… కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత మరియు గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ సభకు లక్ష మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.