గోల్డ్ లోన్ తీసుకునే వారికి స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్..!

-

మీరు గోల్డ్ ని బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా పొందడానికి చాలా ఆప్షన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు లేదా గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం ని తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చు. అయితే ఎక్కడ వడ్డీ రేటు తక్కువ ఉంటే అక్కడే తీసుకోవడం మంచిది.

 

SBI
SBI

లేదు అంటే బాగా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బంగారు రుణాలపై వడ్డీ రేట్లు జెనరల్ గా ఎక్కువ ఉంటాయి. అందుకని గోల్డ్ లోన్ ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకోవడం బెస్ట్.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా చౌక వడ్డీ రేటుకే గోల్డ్ లోన్ ని ఇస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. తక్కువ వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఇతర లాభాలు కూడా దీనితో పొందొచ్చు.

పైగా ప్రాసెసింగ్ ఫీజు మినహాయియింపు కూడా వుంది. అలాగే పలు రకాల రీపేమెంట్ ఆప్షన్లు లభిస్తాయి. బంగారం తనఖా పెట్టి రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణం ఎస్బీఐ లో పొందొచ్చు. లోన్ టెన్యూర్ 3 ఏళ్లు. యోనో ద్వారా రుణం కోసం అప్లై చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టక్కర్లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news