చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపల్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసిపి పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో.. అక్కడ పాగా వేయాలని వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. ప్రచార నుంచి ఓటింగ్ వరకు రెండు పార్టీలు హోరాహోరీగా వ్యవహరించాయి.
అయితే ఇవాళ కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అందరూ ఊహించిన విధంగానే.. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఒకటో వార్డు అలాగే రెండో వార్డులో అధికార వైసిపి పార్టీ గెలుపు దిశగా సాగుతోంది.
మొత్తం పదిహేను వార్డులు ఉండగా ఇప్పటికే వైసిపి రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక 3,4,5,6,7,8 ,9, 10 ,11 ,12,13, 15 వార్డు లలో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరి పోటీ కొనసాగుతోంది. మధ్యానం 2 గంటల లోపు కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. కాగా ఏపీ వ్యాప్తంగా నెల్లూరు కార్పొరేషన్, కుప్పం సహా 12 మున్సిపాలిటీల కౌంటింగ్ కొనసాగుతోంది.