మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే మీరు దీనిని తప్పక చూడాల్సిందే. ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోవడం చాలా ముఖ్యం అని బ్యాంక్ ఎన్నో సార్లు చెప్పింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది లింక్ చేసుకోలేదు. వీలైనంత త్వరగా ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేసుకోండి. ఇది తప్పనిసరి. లేదంటే పలు సర్వీసులు పొందలేక పోవచ్చు. ఆధార్ పాన్ లింక్‌కు మార్చి 31 వరకు గడువు ఉంది కనుక ఈ లోగా పూర్తి చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఈ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేయకపోవచ్చు.
కనుక మీరు రెండింటినీ లింక్ చేసుకోవడం మంచిది. లింక్ చేసుకోకపోతే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని ఎస్‌బీఐ అంది. ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే అప్పుడు పాన్ కార్డు చెల్లుబాటు అవ్వదు. అది ఇన్‌యాక్టివ్ అయిపోతుంది. ఈ సందర్భంలో కొన్ని ట్రాన్సాక్షన్లను నిర్వహించడం కుదరదు.
క్రెడిట్ కార్డు సేవలు కూడా అంతరాయం లేకుండా పొందాలంటే కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్ నెంబర్‌ను పర్మనెంట్ అకౌంట్ నెంబర్ లో లింక్ చెయ్యాలి. ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవాలని భావించే వారు ఇఫైలింగ్ పోర్టల్ 2.0లోకి వెళ్లాలి. ఇక్కడ లింక్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇలా ఈజీగా లింక్ చెయ్యచ్చు.