ఈ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్…!

-

బ్యాంక్ కి సంబంధించి రూల్స్ మారుతూనే ఉంటాయి. తాజాగా కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీనితో ఈ రెండు బ్యాంకుల కస్టమర్స్ కి కూడా షాక్ తగిలింది. మరి ఇక పూర్తి వివరాలను చూస్తే.. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్. లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఈ బ్యాంకులు చెప్పాయి.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంకు 5 బేసిస్ పాయింట్లు పెంచింది. అలానే ఐసీఐసీఐ బ్యాంకు 10 బేసిస్ పాయింట్లను పెంచింది. ఇక వడ్డీల వివరాలను చూస్తే.. కారు, ఆటో, పర్సనల్ లోన్లతో లింక్ అయిన ఏడాది వ్యవధి వాటిపై 7.65 శాతం నుంచి 7.70 శాతానికి పెంచారు. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ ని 0.05 శాతం పెంచారు.

ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా నిర్ణయించారు. అదే ఐసీఐసీఐ బ్యాంకు అయితే ఓవర్‌నైట్, నెల వ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెంచగా.. మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను 7.80 శాతానికి, 7.95 శాతానికి పెంచారు. 7.90 శాతం నుంచి 8 శాతానికి ఏడాది వాటికీ వర్తిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news