తెలంగాణాలో మరో నాలుగు రోజుల అనంతరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రము అంతటా మాములు హడావిడి లేదు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆబ్కారీ శాఖ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుండి మద్యం షాపులను మూసి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆబ్కారీ శాఖ నవంబర్ 28 , 29 మరియు 30 తేదీలలో మద్యం షాపులు, బార్లు నిర్వహించడానికి వీలు లేదని చెప్పేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులలో 1279 ను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ న జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ఎన్నికల శాఖ ప్రకటించనుంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని అందుకుంటాడా లేదా కొత్త పార్టీ అధికారంలోకి వస్తుందా అని సామాన్యులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.