బాస్కెట్ బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ ధరించిన బూట్లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇటీవలే క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 6.15 లక్షల డాలర్లు పలికినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు జోర్డాన్ వేరే షూస్ మంచి ధర పలకగా.. తాజా వేలంలో ఆ రికార్డు బ్రేక్ అయింది. 1985లో ఇటలీలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో జోర్జాన్ ఈ బూట్లను ధరించాడు. ఆ సమయంలో బంతిని గట్టిగా తన్నగా.. గాజు బ్యాక్ బోర్డు ముక్కలపోయింది.
ఇక మే నెలలో జోర్జాన్ తొలి బూట్ల జత 5.60 లక్షల డాలర్లకు అమ్మడుపోయాయి. అయితే, కొత్తగా జరిగిన వేలంలో కనీసం 6.50 నుంచి 8.50 లక్షల డాలర్ల వరకు పలుకుతుందని ఆశించారు. కానీ 6.15 డాలర్లకు మాత్రమే అమ్ముడుపోయాయి.సీనీ తారలు, క్రీడాకారుల వస్తువులు ఈ విధంగా వేలం వెయ్యడం వాటి ద్వారా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.