దేశంలో తెలంగాణ హైకోర్టు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తోంది: జస్టిస్​ చౌహాన్

-

దేశంలో తెలంగాణ హైకోర్టు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తోందని జస్టిస్​ చౌహాన్​ పేర్కొన్నారు. 5 నెలలుగా 9 బెంచ్​లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నడుస్తున్నాయని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో అందరూ నిర్విరామంగా సహకరిస్తున్నారన్న చౌహాన్​.. న్యాయవాదులు, కక్షిదారులు నిస్సందేహంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, క్లర్కుల కోసం రూ.25 కోట్లు, 3 ఆసుపత్రులు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Justice Chauhan
Justice Chauhan

కోర్టుల్లోని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల కోసం హైకోర్టు కొవిడ్ నిధిని ఏర్పాటు చేసిందని చౌహాన్ గుర్తు చేశారు. న్యాయమూర్తులు, న్యాయాధికారులు నిధిని సమకూర్చారన్నారు. కరోనా సోకిన సిబ్బందికి రూ.2.5 లక్షల బీమా సదుపాయం అందేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ విచారణ కోసం 3 మొబైల్ వ్యాన్లు సమకూర్చామన్న చౌహాన్​.. త్వరలో మిగతా జిల్లాల్లోనూ విచారణ వ్యాన్లను తీసుకొస్తామన్నారు. ఈ వ్యాన్లతో ఇంటి వద్దకే న్యాయాన్ని చేర్చే స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధిగమించే శక్తి భారతీయుల్లో ఉందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news