గబ్బిలాలకు కరోనా అంత సీన్ లేదు…

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా వచ్చింది అంటే అందరూ చెప్పే మాట… గబ్బిలాల నుంచి ఇది వచ్చింది అని… గబ్బిలాల నుంచి కరోనా వచ్చిందో లేదో తెలియదు గాని ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం ఒక స్థాయిలో జరిగింది, ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేసారు. చైనా చెప్పక ముందే ప్రపంచం మొత్తం గబ్బిలాలను దోషులను చేసి చూపించింది. అసలు గబ్బిలాల నుంచి కరోనా వస్తుందా…?

చైనా గబ్బిలాలకు ఏమో గాని మన దేశంలో గబ్బిలాలకు మాత్రం అంత సీన్ లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు.భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రధాన శాస్త్రవేత్త రామన్‌ గంగాఖేడ్కర్‌ మాట్లాడుతూ… మనుషులకు గబ్బిలాల నుంచి కరోనా వైరస్‌ సోకడమనేది చాలా అరుదని కొట్టిపారేశారు. అది వెయ్యేళ్లకు ఒకసారి జరిగితే జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఒక వివరణ ఇచ్చింది.

చైనాలో గబ్బిలాల నుంచి అలుగు(పంగోలిన్‌)కు కరోనా వైరస్ సోకిన తర్వాత అది మనిషిలోకి వచ్చి ఉండవచ్చని చైనా చెప్పిన విషయాన్ని పేర్కొంది. భారత్‌లో ఇటీవల చేసిన పరిశోధనల్లో రెండు రకాల గబ్బిలాల్లో కరోనా జాడలు కనుగొన్నారని, అయితే అవి గబ్బిలాల్లో పరివర్తన చెంది, మనుషులకు వ్యాపించేంతటి శక్తిమంతంగా లేవని ఆయన స్పష్టం చేసారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడే గబ్బిలాలను ఆవేశ పడి చంపకండి.

Read more RELATED
Recommended to you

Latest news