తెలంగాణలో మరో దారుణం.. యువతిపై సొంత బాబాయి అత్యాచారం

అమ్మా, నాన్న లేని ఓ యువతి పై బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. వావివరసలు మరిచి సొంతవారే లైంగికంగా వేధించడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే ఉండగానే చనిపోయారు.

దీంతో పెద్దమ్మాయిని ఆమె పెదనాన్న చేరదీయగా.. చిన్న కూతురిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే.. పెద్దమ్మాయి పెదనాన్న కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సొంత బాబాయి భార్యకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.దీంతో ఆమె ట్రైనింగ్ కు వెళ్ళింది. అదే సమయంలో యువతి బాబాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో బాబాయిని చూసుకునేందుకు ఆమెను కుటుంబసభ్యులు వెళ్లమన్నారు. అప్పటి నుంచి ఆ యువతి తన బాబాయికి సేవలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే..ఆ యువతి పై బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంభందించిన వివరాలు తెలియాల్సి ఉంది.