గుడ్ న్యూస్ బతుకమ్మ చీరలు డోర్ డెలివరీ..?

-

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి… టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ అధికారికంగా నిర్వహించడమే కాదు… బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు అందరూ కొత్త బట్టలు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఏటా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ కి సర్వం సిద్ధం అయ్యింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో సురక్షితంగా మహిళలు అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ ఎలా చేయాలి అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అవుతుండగా… కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బతుకమ్మ చీరలను డోర్ డెలివరీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా ఈ ఏడాది ఏకంగా 287 రకాల డిజైన్లు కలిగిన చీరలను ప్రభుత్వం తయారు చేయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news