టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత, నామా నాగేశ్వర్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కాంప్ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదలయింది. ఆమె 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురి కావడంతో ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
అయితే ఆమె చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఇక ఆవిడ భౌతికగాయాన్ని ఈ రోజు సాయంత్రం ఖమ్మం తీసుకురానున్నట్టు చెబుతున్నారు. తెలుగు దేశం హయాంలో మూడు సార్లు ఎంపీగా ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఒక్కసారి మాత్రమే ఆయన ఎంపీగా పని చేశారు. ఇక తెలుగుదేశం లో కీలక పొజిషన్ లో ఉన్న నామా గత లోక్ సభ ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరి ఖమ్మం టికెట్ పొందారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయనకు కేసీఆర్ లోక్ సభ పక్ష నేత పదవిని అప్పగించారు.