బీసీలు వెనకబడలేదు.. వెనక్కి నెట్టేయబడ్డారు – మంత్రి గంగుల

-

కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టిన గడ్డ మీద మనం ఉండటం అదృష్టమని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. క్విట్ ఇండియా ఉద్యమంలో దేశం కోసం, తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం కీలకంగా పని చేసారని అన్నారు. తన కొడుకు, కుటుంబం కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేశారని.. రాష్ట్రం రాకముందే ఆయన చనిపోవడం చాలా బాధాకరం అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును నిషేధించారు.. కానీ అదే గడ్డపై నిలువెత్తు విగ్రహాన్ని పెట్టుకున్నామన్నారు. వచ్చేసారి అన్ని కులాలు, మతాలు కలుసుకునే పండగగా జయంతి వేడుకలు నిర్వహించుకుందామన్నారు గంగుల. బీసీలు వెనక బడలేదు.. వెనక్కు నెట్టేయబడ్డారని అన్నారు. మన రాష్ట్రం వచ్చాక బీసీలకు గౌరవం పెరిగిందని.. అన్ని రంగాల్లో బీసీలను ముఖ్యమంత్రి కాపాడుతున్నారన్నారు.

అలాగే టిఆర్ఎస్ నేత ఎల్ రమణ మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పేదలందరికీ దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఈ రోజు ఐదు ప్రాంతాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news