Parenting tips: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా…? అయితే మీరు బెస్ట్ తండ్రే..!

చాలా మంది తండ్రులు మంచి నాన్న అవ్వాలని అనుకుంటూ ఉంటారు. నిజానికి మంచి నాన్న అవ్వాలంటే కొన్ని లక్షణాలు వారిలో ఉండాలి. ఈరోజు బెస్ట్ డాడ్ కి ఉండాల్సిన లక్షణాలు గురించి చూద్దాం. అయితే మరి ఆ లక్షణాలు మీలో కూడా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ లక్షణాలు కనుక వున్నాయి అంటే మంచి తండ్రి అనిపించుకుంటారు.

నిజాయితీగా ఉండడం:

తల్లిదండ్రులు కచ్చితంగా నిజాయితీతో ఉండాలి. అప్పుడే పిల్లలు కూడా నిజాయితీగా ఉంటారు అని తెలుసుకోండి. నిజాయతీగా ఉండడం చాలా మంచి లక్షణం.

సహనం:

తల్లిదండ్రులు సహనంగా ఉండాలి అప్పుడు పిల్లలు కూడా సహనంగా ఉంటారు పైగా సహనం లేకపోతే ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది తండ్రికి కాబట్టి సహనంగా ఉండాలి.

ఆటలు ఆడడానికి సమయం కేటాయించాలి:

ఎంత బిజీ తండ్రి అయినా సరే పిల్లలతో చక్కగా ఆడుతూ ఉండాలి. స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ వాళ్ళతో ఆడడానికి సమయాన్ని కేటాయిస్తే వాళ్లు కూడా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు.

వాళ్ల గురించి వాళ్లకు తెలియడం:

ప్రతీ ఒక్కరికీ కూడా వాళ్ళ బలం బలహీనత గురించి తెలియాలి. అలానే ప్రతీ తండ్రికీ కూడా వాళ్ళ బలం బలహీనత గురించి తెలియాలి. ఇది కూడా బెస్ట్ డాడీ లో ఉండే లక్షణమే.