ఇటువంటి వాటికి మోసపోవద్దు: SBI

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎకౌంట్ వుందా…? అయితే మీరు తప్పకుండ దీని కోసం తెలుసుకోవాలి. తాజాగా దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసగాళ్ల బారిన పడొద్దని ఖాతాదారులకు సూచిస్తోంది.

అయితే ఎలాగ అయినా సరే ఇటువంటి మోసాలు జరుగుతాయి అందుకే జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే కోవిడ్ 19 నేపథ్యంలో కొత్త తరహా మోసాలు వస్తున్నాయని… కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ తెలిపింది.

మెడిసిన్స్ అని చెబుతూ మోసం చేస్తున్నారని ప్రాణాలను కాపాడే ఔషధాల పేరుతో మోసాలు జరగొచ్చని తెలిపింది. అయితే ఇలా మెడిసిన్స్ చెబితే డబ్బులు లేదా ముఖ్యమైన సమాచారం నమ్మి ఇవ్వొద్దని అంది.

ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. అయితే ఈ సమయం లో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారు. కాబట్టి కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్ళని నమ్మకూడదు. కస్టమర్లను ఆకర్షించడానికి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై ఆఫర్లు ప్రకటించొచ్చని, అయితే ఈ ఆఫర్లను నమ్మితే మోసపోవాల్సి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది