కరెన్సీ నోట్లు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా..?

-

భారతీయ కరెన్సీ నోట్లు వేరు వేరు పరిమాణాల్లో, వేరు వేరు రంగుల్లో ఉంటాయి. అధిక విలువ కలిగిన పెద్ద నోట్లపై వాటి విలువ, తదితర అంశాలను ముద్రించడం జరుగుతుంది. అనేక భద్రత ప్రమాణాల మధ్య రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను తయారు చేస్తుంది. అయితే చాలా మంది వ్యక్తులకు నోట్లు తయారీ చేసేటప్పుడు ఎంత ఖర్చు పడుతుందనే విషయం తెలియదు. సాధారణ కాగితంలాగా కనిపించేదైనా దీనికి చాలా విలువ ఉంటుంది. భారతీయ కరెన్సీలు.. వాటి తయారీకి అయ్యే ఖర్చులను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

డబ్బులు
డబ్బులు

2018 నాటి డేటా ప్రకారం.. రూ.10 నోటు ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. అదే రూ.50 నోటు ముద్రించాలంటే రూ.11.1 ఖర్చు పడుతుంది. రూ.100 నోటును ముద్రించడానికి రూ.1.51 ఖర్చు అవుతుంది. అలాగే రూ.200 నోటును ముద్రించడానికి రూ.2.15 పైసలు ఖర్చు అవుతుంది. అలాగే రూ.500 నోటు ముద్రించడానికి రూ.2.13 ఖర్చు అవుతుంది. ప్రింటింగ్ ప్రెస్‌ను బట్టి నోట్లు ముద్రించడానికి అయ్యే ఖర్చులో స్వల్ప మార్పులు ఉంటాయి.

రూ.2 వేల నోట్లు ముద్రించడం వల్ల 2018-19లో చాలా తక్కువ ఖర్చు ఏర్పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంటే ప్రస్తుతం ఈ ధర గణనీయంగా తగ్గింది. అప్పుడు నోటు ముద్రించడానికి రూ.18.4 ఖర్చు అయ్యేది. 2019లో 65 పైసలు తగ్గించారు. 2000లో రూ.2 వేల నోటు ముద్రించడానికి 4 రూపాయలు 18 పైసలు ఖర్చవుతుందని, 2019లో నోటు ముద్రించడానికి రూ.3.53 పైసలు ఖర్చవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ నోటు ముద్రించడానికి రూ.3 నుంచి 4 రూపాయలు ఖర్చు అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news