వరంగల్ లో మున్సిపల్ జోరు.. రంగం లోకి స్టార్ క్యాంపైనర్స్ !

వరంగల్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. ఈరోజు నుంచి అన్ని పార్టీల స్టార్ క్యాంపైనర్స్ రంగంలోకి దిగనున్నారు. నేడు వరంగల్ లో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులు పర్యటించనున్నారు. అలాగే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కూడా పాల్గొననున్నారు.

ఇక అలానే వరంగల్ నగరంలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పలువురు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల గడువు దగ్గరకు రావడంతో స్టార్ క్యాంపైనర్స్ రంగంలోకి దిగనున్నారు. మొత్తం మీద ఎన్నికల హడావుడి కోసం అన్ని పార్టీల అగ్రనేతలు వరంగల్ లో మోహరించడంతో ఆసక్తికరంగా మారింది.