ఇంతకాలం సినీ సెలబ్రెటీలకు సంబంధించి బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హీరోలు, నిర్మాతలు, దర్శకులు… ఇలా వరుసపెట్టి ఈ ఛాలెంజ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆ ఛాలెంజ్ లు అన్నీ… గరిష్టంగా ఇంటిపనులు, వంటింటి పనులు గా మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఛాలెంజ్ ఫీవర్ రాజకీయ నాయకులకు కూడా వ్యాపించింది. ఇందులో భాగంగా నారా లోకేశ్ కు ఒక క్లిష్టమైన ఛాలెంజ్ విసరబడింది.
అవును… నారా లోకేశ్ కి టీడీపీ మరో యువనేత పరిటాల శ్రీరామ్ నుంచి బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ఎదురైంది. సినీ సెలబ్రెటీలనుంచి ఇన్స్ఫిరేషన్ పొందారో ఏమో కానీ… తనను తానే నామినేట్ చేసుకున్న శ్రీరామ్ .. కిచెన్ పనులు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించినట్లు ఉన్నారు. అందులో భాగంగా… రైతు బిడ్డగా వ్యవసాయ పనులను చేయడంతో పాటు పలువురు పొలిటికల్, సినీ సెలబ్రిటీలకు అతను సవాల్ విసిరాడు. ఈ విషయాన్ని శ్రీరామ్ తాజాగా తన ట్విట్టర్ లో పేర్కొంటూ.. “నాన్నకి ఇష్టమైన, నాకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పనులు చేశాను. మీరు కూడా మీకు అందుబాటులో వున్న పనులు చేస్తారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ఛాలెంజ్ కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్ , సినీ నటుడు మోహన్ బాబు, సినీ దర్శకుడు ఎన్.శంకర్ లను శ్రీరామ్ నామినేట్ చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ సమయంలో లోకేశ్ ని వ్యవసాయం చేయమంటే ఎలా చేస్తారబ్బా? ఈ పరిస్థితిలో చినబాబుని ఇబ్బందిపెట్టడం కరెక్టేనా అని లోకేశ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారంట! ఆ సంగతులు అలా ఉంటే… ఇంతకూ శ్రీరామ్ ఛాలెంజ్ ను లోకేశ్ స్వీకరిస్తాడా? స్వీకరిస్తే ఏ పని చేస్తాడు? ఈ పరిస్థితుల్లో అసలు లోకేశ్ కు అందుబాటులో ఉన్నపనులేంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!
కాగా… ఈ ప్రశ్నలకు లోకేశ్ కు అందుబాటులో ఉన్న పనులు అంటే… ట‌్విటర్ లో పోస్ట్‌లు పెట్టడమా? లేఖలు రాయడమా? కొడుకుతో సైక్లింగ్ చేయడమా? అని సమాధానలు వస్తున్నాయి. ఏది ఏమైనా… ఈ ఛాలెంజ్ కి లోకేశ్ ఏమి చేస్తారు అనేదానిపై మాత్రం నెటిజన్లు సోషల్ మీడియా ముందు కూర్చుని ఎదురుచూస్తున్నారట!