కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి. సాధరణంగా చాలా మంది అత్యవసరనిధిని ఏర్పరచుకుంటారు. చేయని వారు ఇకపై మెయిన్‌టెయిన్ చేయండి. ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు అత్యవసర నిధి ఎంత ఉండాలి? తెలుసుకందాం.
అత్యవసరనిధిని సా«ధారణంగా 3–6 నెలలు ఇంటికి సరిపోయే నిధిని అందుబాటులో పెట్టుకోవాలిని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. కరోనా నేపథ్యంలో ఇది ప్రస్తుతం కనీస నిధి, మీకు
వీలైన విధంగా ఎక్కువ స్థాయిలో నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఒకవేళ కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తే అప్పుడు అత్యవసర నిధిని కనీసం 12 నెలల సరిపడా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే కాస్త తక్కువైన ఫర్వాలేదు.
- ఈ మధ్యకాలంలో ఏమైన ఎక్కువ ఖర్చులు వచ్చాయో చూసుకోండి. ఒకవేళ అవి పునరావృతమయ్యే అవకాశం ఉందా? గ్రహించండి. ఎందుకంటే ఇలా ముందస్తుగానే ఖర్చులను అంచనా వేసుకొని అప్రమత్తంగా ఉండాలి.
- నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎంఐలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేయాలి. గత సంవత్సరం ప్రభుత్వం ఆరు నెలల మారటోరియానికి అవకాశం కల్పించింది. కానీ, ఈ సారి అవి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కూడా ఇంటి నుంచి చికిత్స తీసుకున్నా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.
- అత్యవసర నిధి నుంచి రాబడికి ఆశించవద్దు. ఈ నిధిని ప్రత్యేకించి మొత్తంలో 20 శాతాన్ని ఇంట్లో ఉంచుకోండి. మిగిలినది బ్యాంక్‌లో పొదుపు చేసుకోవాలి లేదా ఫ్లెక్సీ డిపాజిట్, లిక్విడ్ ఫండ్లలో పొదుపు చేసుకోవాలి.
- కరోనా నేపథ్యంలో మహమ్మారి బారిన పడినా మన అవసరాల నిమిత్తం ఆన్‌లైన్ చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే దాని కోసం కూడా తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. సురక్షితంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడమే మంచిది.