ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మీకు తెలుసా? అది ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసుకోండి..

-

ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత ప్రతీదీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎక్కడో జరుగుతున్న విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. ఇలా ఒక్కోసారి ఒక్కో టాపిక్ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్త రకం డైట్ అని అనుకోవడం మామూలే. కానీ దీని గురించి తెలిసిన తర్వాత చాలామందికి తెలిసిన డైటే అని, మన దగ్గర వారానికోసారి ఉపవాసం, ఒకపొద్దు అని చేసే వాటినే కొత్తగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారని అర్థమవుతుంది.

అందరికీ తెలిసినదే అయినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు ఏ ప్రమాణాల ప్రకారం దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారో చూద్దాం.

ఉదాహరణకి రాత్రిపూట 8గంటలకి భోజనం చేసి పడుకున్నా. మళ్ళీ పొద్దున్న 8గంటలకి బ్రేక్ ఫాస్ట్ చేసామనుకోండి. అంటే 12గంటల పాటు మనం ఏమీ తినలేదన్నమాట. ఇది కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నట్టే లెక్క. ఇందులో ఇంకో రకం ఉంది. 16గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం. రాత్రి తొందరగా భోంచేసి పొద్దున్న ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉండడం. అంటే, రాత్రి తిన్నాక పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్టుగా లంచ్ చేసేయడం.

ఇంకా, కేవలం నాలుగు గంటల్లో ఆ రోజుకి సరిపడా తినేసి పూర్తి రోజులో ఏమీ తినకుండా ఉండడం. ఇలా రకరకాలుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫాస్టింగ్ ఫాలో అవ్వాలని భావించేవారు మొదట చిన్నగా ప్రారంభించాలి. ఆ తర్వాత తమ శరీరం అలవాటు పడ్డాకే తర్వాతి స్టేజికి వెళ్ళాలి.

Read more RELATED
Recommended to you

Latest news