దేవుడా..ఇదేం ఆచారం రా నాయనా..

-

ఏదైనా పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినా, లేకుంటే ఎక్కడికైనా పవిత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రమే చెప్పులు వేసుకోరు.ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం..కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండానే నడుస్తుంటాము. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఊళ్లో ఎవరూ చెప్పులు వేసుకోరు..ఏదైనా కారణాలు చెప్పి చెప్పులు వేసుకుంటే మాత్రం వారికి కఠిన శిక్షలు తప్పవు..గ్రామ బహిష్కరణ కూడా ఉందట..ఇదేం ఆచారం రా బాబు..

 

మీరు విన్నది అక్షరాలా నిజం తమిళ నాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో అండమాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో ఎక్కువ మంది రైతులే. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దానికి ఊరంతా పూజలు చేస్తారు. ఇంతకు మించి ఎవరూ గ్రామంలో చెప్పులు ధరించి వెళ్లడానికి అనుమతి లేదు. బయటి నుంచి ఎవరైనా గ్రామానికి వస్తున్నారంటే ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్లాల్సిందే..అంతే కాకుండా గ్రామంలో కూడా ప్రజలు చెప్పులు లేకుండానే తిరుగుతుంటారు..

అక్కడి వారంతా భూమిని పవిత్రమైన దేవతగా భావిస్తారు.దేవుని ఇల్లుగా భావిస్తారు. రోడ్డుపై ఎంత ఆర్భాటం చేసినా చెప్పులు లేకుండా నడవడానికి ఇదే కారణం. చెప్పులు వేసుకుని రోడ్డుపై నడిస్తే దేవుడికి కోపం వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.ఆ ప్రాంతంలో 500 మంది నివసిస్తున్నారు.. వారిలో కేవలం ముసలి వాళ్ళు మాత్రమే చెప్పులు, బూట్లు ధరించడానికి అనుమతి ఉంది.. ఈ ఎండలకు అలా ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం..ఏంటో ఈరోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలు..

Read more RELATED
Recommended to you

Latest news