ఆ కారణంగానే రాష్ట్రాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ గొడవలు జరుగుతాయి : ఈటెల రాజేందర్

-

మేడ్చల్‌లో శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఈ అనంత విశ్వంలోని కోటానుకోట్ల జీవులకు మూలాధారమైన నీటిని దివి నుండి భువికి తెచ్చిన భగీరథుడి గురించి మనందరికీ తెలుసు. ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయన తలపై గంగమ్మను భూమిపైకి తెచ్చి మానవాళికి నీటిని అందించమని భగీరథ మహర్షి ప్రార్థించారు అని , అలాంటి కఠోర తపస్సు ద్వారా గంగను భూమిపై తెచ్చిన ఆ మహానుభావుని పేరుతో జయంతి ఉత్సవాలు జరపాలని అప్పట్లో మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయించాం అని ఈటెల రాజేందర్ తెలిపారు.

రాష్ట్రాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ గొడవలు జరిగేది నదీ జలాల కోసమే అని ఈటెల రాజేందర్ అన్నారు. ఆ భగీరథుని పేరుతో మిషన్ భగీరథ అనే పథకం ద్వారా పల్లెపల్లెకూ నీరందించాం అని గుర్తు చేశారు. మనిషికి కూడు, గుడ్డ, నీరు తెచ్చిన ఆద్యులు సగరులు. వారి పేరుతో వచ్చింది సగర జాతి.పురాణ కాలంలో సగరుల వల్ల సాగరం ఏర్పడిన సంగతి మనకు తెలుసు ఇప్పుడు సగర జాతి వారు ఎందరో చెరువులకు, కుంటలకి, ప్రాజెక్టులకు రూపశిల్పులు ఈ సగరులే. ఈ సంఘం వారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతగానో సహకరించారు. మీకు కావలసిన పనులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాటిస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news