సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీనటి, బిజెపి నేత జయప్రద. అజాం ఖాన్ గతంలో చేసిన పనులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలలో అధికార గర్వం మాత్రం ఉండకూడదని అన్నారు జయప్రద. మహిళలను గౌరవించాలని.. ఇలానే జరుగుతుందన్నారు. రాజకీయాలలో వివిధ పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి కానీ, అధికార మదం అన్నది ఉండరాదు అన్నారు.
మహిళలను ఎలా గౌరవించాలో ఆజాం ఖాన్ కి, ఆయన కొడుకు అబ్దుల్లా అజాం కి తెలియదని.. ఈ తండ్రి కొడుకులు తాము చేసిన పాపాలకు తామే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అయితే అజాం ఖాన్, జయప్రద మధ్య గతంలో ఎన్నో వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పలు కేసుల్లో అజామ్ కు మూడేళ్లు, ఆయన కుమారుడికి రెండేళ్లు శిక్ష పడడంతో తండ్రి కుమారులు ఇద్దరు శాసనసభ సభ్యత్వాలను కోల్పోయారు.