యూపీ ఎలక్షన్స్… ఎంఐఎం కూటమి అధికారంలోకి వస్తే సీఎంలు, డిప్యూటీ సీఎంలు వీరే అంటున్న అసదుద్దీన్ ఓవైసీ

-

వచ్చే నెలలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి నేతల జంపింగ్ లు, పొత్తుల వ్యవహరాలు జరుతున్నాయి. ఈసారి ఎంఐఎం పార్టీ కూడా యూపీలో తన ఖాతా తెరవాలని అనుకుంటోంది. ఇప్పటికే ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే యూపీ ఎన్నికల్లో ఎంఐఎం, బాబూ సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో  పొత్తు పెట్టుకున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలో కి వస్తే కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు, ఒకరు ఓబీసీ, మరొకరు దళితులు, ముగ్గురు డిప్యూటీ సీఎంలు ముస్లిం వర్గానికి చెందిన వారు అవుతారని ఓవైసీ వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఎంఐఎం, మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల్లో పాగా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news