ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి రోజు దాదాపు 30 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం చాలా విభాగాలు పై పడింది. తాజా గా ఈ ఏడాది బీజింగ్ లో నిర్వహించ బోయే వింటర్ ఒలింపిక్స్ పై కూడా కరోనా ప్రభావం చూపిస్తుంది. వచ్చె నెల 4 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే కరోనా ప్రభావంతో మైదానంలోకి ప్రేక్షకులను అనుమతి ఇవ్వడం లేదని చైనా అధికారికంగా ప్రకటించింది.
ప్రేక్షకులు లేకుండానే పూర్తి టోర్నిని నిర్వహిస్తామని తెల్చి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో బిజింగ్ కు వచ్చే అథ్లేట్స్ తో పాటు వారితో వచ్చే సిబ్బంది ఆరోగ్య భద్రతల దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా తెలిపింది. వచ్చె నెల 4 తేదీ నుంచి బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నందునా.. ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఆథ్లేట్స్ బీజింగ్ కు బయలు దేరారు. కాగ ఒలింపిక్స్ కోసం వచ్చిన క్రిడాకారులను క్వారైంటెన్, బయో బబుల్ కు వెంటనే పంపిస్తున్నారు.