డ్రగ్స్ డీలర్ ని పట్టుకునేందుకు బెంగళూరుకు చేరుకున్నారు బెజవాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన వ్యక్తుల ద్వారా MDMA డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడు అబ్దుల్ మిషాల్ అహ్మద్. అతను కేరళకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బెంగళూరులో మిషాల్ సొంతంగా MDMA ( మిథిలిన్ డై ఆక్సిమేటా ఫిటమిన్) డ్రగ్ ను క్రిస్టల్ రూపంలో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మిషాల్ పరారయ్యాడు.
ఇతడు గతంలో కాకినాడ కాలేజీలో చదువుకున్నట్లుగా గుర్తించారు. కొన్నాళ్ళుగా అక్కడ తన స్నేహితుడు సతీష్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు చేశాడు మిషాల్. 20 రోజుల క్రితం బెజవాడలో 48 గ్రాముల MDMA డ్రగ్స్ తో సతీష్ పట్టుబడ్డాడు. సతీష్ సహా కాకినాడకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మిషాల్ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు మిషాల్ పరారీలో ఉండడంతో కాల్ డేటా ద్వారా కేరళ, గోవా వెళ్ళనున్నాయి పోలీస్ బృందాలు.