అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై నేటితో 1200 రోజులు అవుతున్న సందర్భంగా మందండంలో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆ శిబిరం వద్దకు వెళుతుండగా అమరావతి ప్రాంతంలో ఆయనపై దాడి జరిగింది. మందండం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా కొంతమంది శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఆయన అటుగా వెళుతున్నారని ముందుగా సమాచారం తెలుసుకున్న కొంతమంది సత్యకుమార్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.
మరి కొంతమంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ” అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు” అని ప్రశ్నించారు చంద్రబాబు.
అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు? pic.twitter.com/oRJVfkZDbE
— N Chandrababu Naidu (@ncbn) March 31, 2023