ఒక్క ఫోన్ చేస్తే మీ ఊరిలోనే మెరుగైన వైద్యం.. !

-

వైద్య సేవ‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక్క ఫోన్ చేస్తే సొంత ఊరు నుండే మెరుగైన వైద్య సేవ‌లు అందించేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఓ మొబైల్ యాప్ ద్వారా ఈ సేవ‌లు అంద‌నున్నాయి. ఆర్ ఎక్స్ టెలికేర్ సంస్థ మొబైల్ యాప్ ద్వారా ఈ ఉచిత వైద్యం అందించ‌నుంది. యాప్ లో పూర్తి వివ‌రాల‌ను న‌మోదు చేసి కాల్ చేస్తే చాలు. విలేజ్ క్లీనిక్ లోని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నేరుగా వైద్యుల‌తో మాట్లాడే అవ‌కాశం ఉంటుంది.

వైద్యులు ఆన్లైన్ ద్వారానే రోగిని ప‌రిశీలిస్తారు. ప‌లు సూచ‌న‌లు మ‌రియు చేసుకోవాల్సిన ప‌రీక్ష‌ల గురించి వివ‌రిస్తారు. అనంత‌రం ఈ ప్రిస్క్రిప్ష‌న్ ద్వారా మందుల‌ను చెబుతారు. ఇక యాప్ అందుబాటులోకి వ‌స్తే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరే అవ‌కాశం ఉంది. మంచి వైద్యం కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లే తిప్ప‌లు త‌ప్పే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే ఈ యాప్ ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆవిష్క‌రించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news