వన్ డే వరల్డ్ కప్ 2023 పై ఇండియా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఘోరమైన ఓటమిని కొని తెచ్చుకుని కప్ ను చేజార్చుకుంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ లో పడింది. గత ఐపీఎల్ లో ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక రానున్న సీజన్ లోనూ నో డౌట్ గా చెన్నై ఫేవరెట్ అని చెప్పవచ్చు. కాగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ సీజన్ 2024 కు ఇంగ్లాండ్ కు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండడం లేదని ప్రకటించింది. స్టోక్స్ కు ఉన్న వర్క్ లోడ్ మరియు ఫిట్నెస్ కారణాల రీత్యా సీజన్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిజంగా ఇది చెన్నై సూపర్ కింగ్స్ కు షాకింగ్ వార్త అని చెప్పాలి. గతంలో ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టోక్స్ ను రూ. 16 .25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.