అరటి వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. కానీ ఆరటి తొక్క కూడా మేలు చేస్తుందని చాలా కొద్ది మందికే తెలుసు. తొక్కలోది అని తీసిపారేసే చాలామంది తొక్క గురించి తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యాన్నందించే అరటి తొక్క గురించి ఈ రోజు తెలుసుకుందాం. విటమిన్ బి -6, బి -12, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది.
జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది
అరటి తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు అరటి తొక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య నుండి బయటపడవచ్చు. ప్రేగు సిండ్రోమ్ సమస్య ఉన్నవారు కూడా అరటి తొక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దంతాలను శుభ్రపరుస్తుంది
నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలను వారానికి ఒకసారి తొక్కతో రుద్ది శుభ్రపరిస్తే తెల్లగా ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా దంతాలు మిల మిల మెరిసేలా తయారవుతాయి.
మొటిమలను తగ్గించడానికి
ముఖం మీద మొటిమలతో ఇబ్బంది పడుతున్నవారు అరటి తొక్కను ముఖంపై రుద్దండి. వారం రోజులో మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇందులోని ఫినోలిక్ కారణంగా చర్మం మంట తగ్గుతుంది. ఇంకా చర్మంపై ముడుతలను తగ్గించడంలో అరటి తొక్క సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి ముడుతలు తగ్గించడంలో సాయపడతాయి.
కడుపు నొప్పిని తగ్గిస్తుంది
ఇందులో ఉండే కెరాటనాయిడ్లు, ఫాలిఫెనాల్స్ మొదలగునవి కడుపు నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. అందుకే ఇంకెప్పుడూ తొక్కలోది అని తీసిపారేయండి. ఎందుకంటే తొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.