పుట్టుమచ్చలు మనకు పుట్టినప్పటి నుంచి ఉంటాయి. అవి చనిపోయే వరకు ఉంటాయి. వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. పుట్టుమచ్చలపై జరిపిన పరిశోధనల్లో వ్యక్తికి పుట్టుమచ్చలు ఉంటే వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో తెలుసుకుందాం.
కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది పుట్టుమచ్చలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో గుర్తించారు.
- పుట్టుమచ్చలు ఆడవారికి, మగవారికి వేర్వేరు ఫలితాలను ఇస్తాయి. సామాన్యంగా మగవాళ్లకి పుట్టుమచ్చలు కుడివైపు ఉంటే శుభం. మహిళలకు ఎడమవైపు ఉంటే మంచిదని పుట్టుమచ్చల పరిశోధకులు తెలుపుతున్నారు.
- శరీరంపై ఉండే పుట్టుమచ్చలే పన్నెండు కంటే ఎక్కువ ఉంటే అవి అశుభం. అటువంటి వ్యక్తికి సంతోషం ఉండదట. వారి జీవితం రోజురోజుకు దుర్భరంగా మారుతుందని చెబుతున్నారు.
- కనుబొమ్మలపై కుడివైపు పుట్టుమచ్చ ఉంటే వారి వివాహ జీవితం సఖ్యంగా ఉంటుంది. ఎడమవైపు ఉంటే వారి వైవాహిక జీవితంలో గొడవలు అవుతాయి. ఇక కనుబొమ్మపై ఉంటే వారు అధిక ప్రయాణాలు చేస్తారట.
- కన్ను లోపల పుట్టుమచ్చ ఉంటే వారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న విషయాలకు కూడా లోతుగా ఆలోచిస్తారు.
- చెవిలో పుట్టుమచ్చ ఉండేవారు ఎక్కువకాలం జీవిస్తారు. ముఖం చుట్టుపక్కల ఉంటే ఆనందంగా ఉంటారు. నోట్లో పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు. వారికి అదృష్టం ఉంటుంది.
- ముక్కుపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా తెలివైనవారని అర్థం. ముఖ్యంగా మహిళలకు అదృష్టం.
- పెదవిపై పుట్టమచ్చ ఉన్నవారికి ప్రేమ ఎక్కువ. కింద పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారు పేదరికం అనుభవిస్తారు.
- ఎడమ బుగ్గపై ఉంటే నిరాశ, కుడిబుగ్గపై ఉంటే సంపన్నులు అవుతారు.
- కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే నిబద్ధత కలిగిన వ్యక్తి అని అర్థం. ఎడమ భుజంపై ఉంటే కోపం ఎక్కువ. చేతులపై పుట్టుమచ్చలు ఉన్నవారు టాలెంట్ ఉన్నవారవుతారు.
- కుడివైపు వెనకవైపున పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు. ఎడమ చేతిపై ఉంటే ఎక్కువ ఖర్చు పెడతారు.