వాటే స్కీమ్..రూ.200 పొదుపుతో రూ.32 లక్షలు పొందొచ్చు..!

-

మీరు మీ దగ్గర వుండే డబ్బులని దాచుకోవాలని అనుకుంటారా..? ఏ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చెయ్యాలని  అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. చిన్న మొత్తం లో సేవ్ చెయ్యడానికి ఇది బెస్ట్. పైగా దీని వలన లాభాలు కూడా ఎక్కువే. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్. ఈ పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే అదిరే ప్రయోజనాలని పొందొచ్చు.

money
money

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో మాక్సిమం రూ.1.5 లక్షల వరకు కూడా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. అంటే 15 ఏళ్ల పాటు ప్రతి నెలా డబ్బులు పెట్టాలి.

కావాలనుకుంటే ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోచ్చు. ఇప్పుడు అయితే పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. అయితే ఈ వడ్డీ రేట్లని ప్రతీ మూడు నెలలకి ఓసారి మారుస్తూ వుంటారు. మీరు కనుక రోజుకి రెండు వండాలని పొదుపు చేసి అంటే నెలకు రూ.6 వేలు సేవ్ చేస్తే 15 ఏళ్ల తర్వాత రూ.19.5 లక్షలు పొందొచ్చు. ఒకవేళ ఐదు ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తే చేతికి దాదాపు రూ.32 లక్షల వరకు వస్తాయి. ఇలా అయితే మొత్తం రూ.14.4 లక్షలు వస్తాయి. అలానే రూ.17.5 లక్షల వడ్డీ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news